ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం గుంతపల్లి శివారులో 40 ఎకరాల్లో దాదాపు 300 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌కు చెందిన మోనిన్ సంస్థ ఏర్పాటుచేస్తున్న ఆహారశుద్ధి పరిశ్రమకు బుధవారం నాడు ఆయన శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం గుంతపల్లి శివారులో 40 ఎకరాల్లో దాదాపు 300 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌కు చెందిన మోనిన్ సంస్థ ఏర్పాటుచేస్తున్న ఆహారశుద్ధి పరిశ్రమకు బుధవారం నాడు ఆయన శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ఈ మోనిస్ అనే సంస్థకు సాస్‌లు, సిరప్‌లు తదితర వాటిని ఉత్పత్తి చేస్తున్న కంపెనీగా అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. అయితే కంపెనీకి చెందినటువంటి పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు మంత్ర కేటీఆర్. అయితే ఈ సంస్థ యాజమాన్యం గతంలో 8 రాష్ట్రాల్లో పర్యటించినట్లు కేటీఆర్ అన్నారు. కానీ చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నారని తెలిపారు. ఇక్కడ టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం వాళ్లకు నచ్చిందని.. అందుకోసమే వారు ఇక్కడ పెట్టారని పేర్కొన్నారు.అలాతే అది కాలుష్యరహిత పరిశ్రమ కావడంతో ప్రజలకు కూడా ఎలాంటి నష్టం ఉండదని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మోనిన్‌కు సంస్థకు సంబంధించి ప్రపంచంలోనే ఇది ఎనిమిదో పరిశ్రమ అని చెప్పారు. అలాగే 18 నెలల్లో ఉత్పత్తులు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.