top of page
Suresh D

బడులకు సంక్రాంతి సెలవులపై తెలంగాణ సర్కార్ ప్రకటన - ఎప్పటివరకంటే..📢🌾

పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. సంక్రాంతి పండగ వస్తున్న నేపథ్యంలో సెలవుల్ని ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. 

రాష్ట్రంలోని మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని బడులకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 13న రెండో శనివారం ఉండగా…. 14వ తేదీన భోగి ఉంది. ఇక 15వ తేదీన సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. 18వ తేదీన బడులన్నీ తిరిగి పునఃప్రారంభమవుతాయని సర్కార్ వెల్లడించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే…. జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రెండో శనివారం కాగా…. జ‌న‌వ‌రి 14వ తేదీన భోగి పండ‌గ.. ఆదివారం వ‌చ్చింది. జ‌న‌వ‌రి 15వ తేదీన సంక్రాంతి పండ‌గ‌ సాధార‌ణంగా సెల‌వులు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 16వ తేదీన ఆప్ష‌న‌ల్ హాలిడే ఇవ్వనున్నారు. దీంతో పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు మ‌రో రెండు రోజులు పాటు అద‌నం సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఫలితంగా ఏపీలో బడులు, కాలేజీల‌కు దాదాపు ఆరు రోజులు పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. దనిపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. రేపోమాపో సెలవులపై ఏపీ సర్కార్ కూడా ప్రకటన చేయవచ్చు.📢🌾

bottom of page