తెలంగాణకు కష్టమొచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్సే.. కేటీఆర్ ట్వీట్
- MediaFx
- Sep 2, 2024
- 1 min read
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పర్యటిస్తూ.. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన బీఆర్ఎస్ కార్యకర్తల చిత్తశుద్ధిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. వర్షాలు, వరదల్లో కూడా ప్రజాసేవలో బీఆర్ఎస్ నాయకులు నిమగ్నమయ్యారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉంటున్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలమైంది. మేమున్నామంటూ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు భరోసా కల్పిస్తున్నారు. మీ అలుపెరగని కృషే పార్టీకి కొండంత బలం. తెలంగాణకు కష్టమొచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్సే అని మరోసారి రుజువైంది. అయితే వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న కార్యకర్తలు కూడా జాగ్రత్తలు తీసుకోని సురక్షితంగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు.