తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టీస్‌లు రానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరు సీజేల పేర్లను సిఫార్సు చేసింది.
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టీస్‌లు రానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరు సీజేల పేర్లను సిఫార్సు చేసింది.ణ రాష్ట్రానికి జస్టీస్ అలోక్ అరదేను సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను సిఫార్సు చేసింది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టీస్ అలోక్ అరదే 2009లో ఆ రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2018 నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి గా విధులు నిర్వహిస్తున్నారు.అలాగే జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ జమ్మూకశ్మీర్‌కు చెందినవారు. ఈయన 2013లో అక్కడి హైకోర్టుకు న్యాయమూర్తిగా సేవలు అందిచారు. ఆ తర్వాత ధీరజ్ 2022 జూన్ నుంచి బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. అయితే ఈఏడాది ఫిబ్రవరిలో జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకుర్‌ను సుప్రీంకోర్టు కొలిజియం మణిపూర్ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. కానీ అది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటం వల్ల దాన్ని కొలీజియం రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ జస్టీస్‌గా ఆయన పేరు సిఫార్సు చేసింది.