రైతు బంధు నిధులు పడకుండా ఎన్ని రోజులు ఆపగలరు.. డిశంబర్ 3వ తేదీ వరకూ ఆపగలరు. డిశంబర్ 3 తరువాత మళ్లీ ఉండేది మా కేసీఆర్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
డిశంబర్ 3వ తారీఖు తరువాత రైతు బంధు పైసలు టింగు.. టింగు మని రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ఆగిపోతుందని అన్నారు. తాము ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని, కాని కాంగ్రెస్ మాత్రం భూమితో సంబంధం లేకుండా రైతుకు రూ. 15 వేలు మాత్రమే ఇస్తానని చెప్తోందని హరీష్ రావు వివరించారు. రైతుబంధును అడ్డుకున్న కాంగ్రెస్కు రైతులు బుద్ధి చెప్తారని హరీష్రావు హెచ్చరించారు. రైతులతో మాది ఓటు బంధం కాదు పేగు బంధం అని చెప్పారు. 2017లో రైతు బంధు ఇచ్చినప్పుడు ఓట్లు లేవు.. ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వట్లేదు అని వివరించారు. కర్ణాటకలో రైతు బంధును ఆపేసిన కాంగ్రెస్ పార్టీ.. అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తుంది. ఈ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. 🌾📣