top of page
Shiva YT

🌊 మరో ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం 🌊

🌐 తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై 2003 ఆగస్టు 26న కోడాడ నుండి కేసీఆర్‌ పాదయాత్ర చేపట్టారు. నాలుగు రోజలపాటు సాగిన పాదయాత్ర హాలియాలో బహిరంగ సభతో ముగిసింది. 2004లో ఫ్లోరైడ్‌పై అధ్యయన కోసం కేసీఆర్‌ రెండ్రోజుల బస్సు యాత్ర చేపట్టారు. మర్రిగూడ, నాంపల్లి, చండూర్‌, నార్కట్‌పల్లి మండలాల్లో పర్యటించి ఫ్లోరైడ్‌ బాధితులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సమయంలోనే గుండె నిండా ఫ్లోరైడ్‌ బండా… తల్లడిల్లే నల్లగొండ అంటూ స్వయంగా కేసీఆర్‌ పాట రచన చేశారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కృష్ణా జలాల్లో వాటా కోసం మరోసారి పోరాటానికి సన్నద్ధమవుతోంది. 🌊


bottom of page