తెలంగాణ రాష్ట్ర గీతం మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే. కీరవాణికి స్వరాలు కూర్చే బాధ్యతను అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కీరవాణిని ప్రభుత్వం తీసుకోలేదని, అందె శ్రీనే ఎంచుకున్నాడని, పూర్తి బాధ్యత ఆయనదే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కీరవాణి స్వర కల్పన చేసి, ఈ పాటను సింగర్ హారిక, రేవంత్ పాడేశారు. తెలంగాణ గొప్ప చరిత్ర, సంస్కృతి, సారాంశాన్ని సంగ్రహించే ఈ గీతం రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచేలా ఆలపించడం విశేషం. హారిక తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ, కీరవాణి సార్, సీఎం రేవంత్ రెడ్డి సర్‌కి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ గీతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జూన్ 2, 2024న ఆవిష్కరించబడుతుంది. శుక్రవారం నాడు కీరవాణి తన టీంతో కలిసి సీఎంను కలిశాడు. హారిక షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.