top of page
Suresh D

2023లో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు..

2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరా హోరి పోరు జరిగింది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నాటి నుంచి కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (అప్పటి టీఆర్ఎస్) భారీగా సీట్లను కైవసం చేసుకుంది. 119 నియోజకవర్గాల్లో 88 సీట్లను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 19 సీట్లను గెలుచుకోగా.. ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 విజయం సాధించారు.2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరా హోరి పోరు జరిగింది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నాటి నుంచి కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ లో ముందంజలో ఉండగా.. కామారెడ్డిలో వెనుకంజలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి రెండుచోట్ల ముందంజలో ఉన్నారు.

11:30 గంటల వరకు ట్రెండ్స్ ప్రకారం..

  • కాంగ్రెస్ 66

  • బీఆర్ఎస్ 45

  • ఎంఐఎం 4

  • బీజేపీ 3

  • ఇతరులు 1

bottom of page