top of page
Shiva YT

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 🏛️👥

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఎన్నికల జరుగుతుంది. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవమైంది.

స్పీకర్‌గా ఆయన పేరును కాంగ్రెస్‌ ప్రతిపాదించగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు మద్దతు తెలిపాయి. స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటన చేస్తారు. అనంతరం గడ్డం ప్రసాద్‌ బాధ్యతలు చేపడతారు. స్పీకర్‌ బాధ్యతలు చేపట్టాక కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో నిర్ణయిస్తారు. పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఏసీ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలోనే క్యాబినెట్‌ సమావేశం జరగనుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై రేపు ప్రసంగిస్తారు. ఎల్లుండి శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. పార్లమెంట్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జారీ చేసిన పాసులు తప్ప.. అన్నింటినీ నిలిపివేయాలను ప్రొటెం స్పీకర్‌ అధికారులను ఆదేశించారు. 🏛️👤✨

bottom of page