top of page
MediaFx

🎉 తెలంగాణ దశాబ్ది వేడుకలు కొత్త రాష్ట్ర గీత ఆవిష్కరణ


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కొత్త రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు సచివాలయంలో మంత్రులు, పార్టీ సీనియర్లతో సమావేశమైన సీఎం రేవంత్ పలు సూచనలు స్వీకరించారు. మొత్తం 10.40 నిమిషాల నిడివితో ఉన్నప్పటికీ, మూడు చరణాలతో కూడిన 2.5 నిమిషాల గీతమే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగిస్తామని సీఎం తెలిపారు.

🎶 కీరవాణి నేతృత్వంలో గాయకులు పాడిన ఈ గీతం అందరినీ అలరించింది. ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు చేసిన సూచనకు సీఎం అంగీకరించి ముగ్దూం మోహిణుద్దీన్, షేక్ బందగీ, కొమ్రం భీం పేర్లను కూడా గీతంలో పొందుపరిచారు.

📜 తెలంగాణ వైభవాన్ని తెలుపుతూ మహాకవి అందె శ్రీ రచించిన ఈ పాట, ఆస్కార్ విజేత కీరవాణి అద్భుతంగా స్వరాలు సమకూర్చారు. ఇప్పుడు తెలంగాణాలో ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తోంది.

🎤 ఈ ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని నేపధ్యగాయకుడు రేవంత్, సింగర్ హారిక నారాయణ ఆలపించారు. ఈ పాట విడుదలకు ముందు ఈ ఇద్దరు సింగర్స్ సోషల్ మీడియా పోస్ట్ లు వైరల్ గా మారాయి. హారిక నారాయణ, రేవంత్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తమ కృతజ్ఞతలు తెలిపారు.


bottom of page