top of page
MediaFx

బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు

తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. ఉదయం గం.8.40 వరకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో బీజేపీ ఐదు స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి నగేశ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌లు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ముందంజలో ఉన్నారు.

bottom of page