top of page
Suresh D

🌟 న్యూ ఇయర్ వేడుకల్లో జోరుగా మద్యం అమ్మకాలు.. ఒక్కరోజులో ప్రభుత్వానికి కోట్ల ఆదాయం..🥂🎉

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో తెలంగాణలో మద్యం ఏరులై పారింది. వేడుకల పేరుతో జనం విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. 2023 డిసెంబర్‌ 31న పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్నసంబరాలు ప్రభుత్వ ఖజానను నింపాయి.

తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. 🎉 మూడు రోజుల్లో రూ.625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్‌కి అనుమతి ఇవ్వడం, బార్‌లకు ఒంటి గంట వరకు ఓపెన్ ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్‌ 28న రూ.133 కోట్లు, 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో తెలంగాణలో మద్యం ఏరులై పారింది. వేడుకల పేరుతో జనం విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. 2023 డిసెంబర్‌ 31న పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్నసంబరాలు ప్రభుత్వ ఖజానను నింపాయి. తెలంగాణలో ఒక్కరోజే 313కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడైంది. ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందర్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 🥂🎉

bottom of page