అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తన మార్క్ పాలన చూపిస్తోంది. 🚀 ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అడుగులు వేస్తోంది. 💪 తాజా మంత్రి సీతక్క తీసుకున్న నిర్ణయంతో అంగన్వాడీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 🌟
అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తన మార్క్ పాలన చూపిస్తోంది. 🚀 ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అడుగులు వేస్తోంది. 💪 తాజా మంత్రి సీతక్క తీసుకున్న నిర్ణయంతో అంగన్వాడీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 🌟 📚తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క బాధ్యతలు చేపట్టారు. 🏛️ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో వేద మంత్రోచ్ఛరణాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 🏰 అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్ మీద మంత్రిగా తొలి సంతకం పెట్టారు సీతక్క.
ఈ మేరకు ఆమె అంగన్వాడీలకు గుడ్న్యూస్ చెప్పారు. 📢 ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. 🔄 ఇందు కోసం రూపొందించిన ఫైలుపై మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు. ఆమె నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి.. 🏠
మరోవైపు అంగన్వాడీ టీచర్లకు కూడా మంత్రి సీతక్క తీపి కబురు అందించారు. 📚 అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్ మీద కూడా సీతక్క సంతకం పెట్టారు. 🎉 దీంతో ఇప్పటివరకు రూ.7,500 జీతం అందుకున్న అంగన్వాడీ టీచర్లు.. ఇక నుంచి రూ.13,500 జీతం అందుకోనున్నారు. 🌈 మొదటి సంతకంతోనే మంత్రి సీతక్క తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 🌟