👥 కొంతమంది లీడర్లు ఎన్నికల సమయంలో సరైన ఆస్తులు, సరైన కేసుల వివరాలను సమర్పించని కారణంగా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని అఫిడవిట్ ఆధారం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చి జలగం వెంకట్రావుని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ స్టే నివ్వడంతో మళ్లీ వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ఎదుర్కొంటున్న, పెండింగ్‌లో ఉన్నాయి. ⚖️
🏛️ పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల వారిగా గమనిస్తే మంచిర్యాల, హుస్నాబాద్, గద్వాల్, మహబూబ్‌నగర్, దేవరకొండ, అసిఫాబాద్, పటాన్‌చెరు, ఖైరతాబాద్, వేములవాడ, సికింద్రాబాద్, కొడంగల్, ఇబ్రహీంపట్నం, మహబూబ్‌నగర్, వరంగల్ ఈస్ట్, ఆలేరు, జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ధర్మపురి, కోదాడ, నాగర్ కర్నూల్, గోషామహల్, వికారాబాద్, గజ్వేల్, పరిగి, జనగాం, కరీంనగర్, నాంపల్లి, కొత్తగూడెం సహా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ⚖️