top of page
MediaFx

తెలంగాణలో తొలి ట్రెండ్స్ ఇలా.. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే..

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను బీజేపీ, కాంగ్రెస్‌ చెరో 8 స్థానాల్లో, మజ్లిస్ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో నిలిచారు.

కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో:

  • నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి

  • ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి

  • మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్

పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, భువనగిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ ముందంజలో ఉన్నప్పటికీ పోటాపోటీగా ఉంది.

బీజేపీ అభ్యర్థులు ముందంజలో:

  • వరంగల్ నుంచి ఆరూరి రమేశ్

  • సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి

  • మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్

  • ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్

  • కరీంనగర్ నుంచి బండి సంజయ్

  • నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్

  • చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ

bottom of page