📚🧪🎓 తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2023 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన వెలువరించింది. 🏛️📝🌟
గతంలో ఇచ్చిన సెట్ 2023 నోటిఫికేషన్ ప్రకారం ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 29వ తేదీతో తుది గడువు ముగిసింది. 🗓️📅💻 తాజాగా ప్రకటనలో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 📢🗓️📅
👨🏫📚🎓 కాగా ప్రతీయేట అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాల అర్హత కోసం ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సెట్ పరీక్ష నిర్వహిస్తోంది. 👨🎓📖💼 ఈ ఏడాది కూడా సెట్ నిర్వహణకు ప్రకటన వెలువరించింది.
📚📊🧾 మొత్తం జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్ష జరుగనుంది. 📝📚📅 కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ✍️📊📚 గరిష్ఠ వయోపరిమితి ఏమీలేదు. 💡🗂️🧑🎓 దరఖాస్తు ఫీజు కింద ఓసీ కేటగిరీ అభ్యర్ధులు రూ.2000, బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్ అభ్యర్ధులు రూ.1000 చెల్లించాలి. 💸📝📊