తెలుగు సీనియర్ నటి మీనా భర్త విద్యా సాగర్ 2022లో మరణించారు. దీని తర్వాత 47 ఏళ్ల మీనా ఒక నటుడితో ప్రేమలో ఉందని, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మీనా వివరణ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా నిజాన్ని చెప్పింది. ‘ప్రస్తుతానికి నాకు రెండో పెళ్లి ఆలోచన లేదు. భవిష్యత్తు ఫలితం గురించి మనం ఇప్పుడు ఎలా చెప్పగలం? ఇలాంటి పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దు’ అని స్పష్టం చేసింది.