కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే.
మరి రీసెంట్ గానే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేయడంతో ఆసక్తి గా అంతా ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దీని తర్వాత వెంటనే మరో అప్డేట్ అంటూ కూడా నిర్మాతలు హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దీనిపై క్లియర్ టాక్ వినిపిస్తోంది.దీని ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ రెండు రోజుల్లోనే రానున్నట్టుగా వినిపిస్తోంది. వెంకట్ ప్రభు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కాంబినేషన్ లో సాలిడ్ ఆల్బమ్స్ ఉన్నాయి. దీనితో గోట్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 5న సినిమా పానిండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది.