top of page

‘లియో’విడుదలకు ఇంకా 42 రోజులు..

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ స్టమినాను మరోసారి నిరూపించే లెక్కలివి. ఆయన హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘లియో’ సినిమా విడుదలకు ఇంకా 42 రోజుల సమయం ఉండగానే రికార్డుల వేట మొదలైపోయింది. 🎥

సినిమా విడుదలకు నెలరోజలకు పైగా సమయం ఉండగా.. అప్పుడే బాక్సాఫీసు కలెక్షన్ మొదలుపెట్టేసింది. 📈 అయితే, అది ఇండియాలో కాదు.. యూకేలో. 🇬🇧 ‘లియో’ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అహింసా ఎంటర్‌టైన్మెంట్ సంస్థ యూకేలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 🌍 అయితే, విడుదలకు ఇంకా 42 రోజులు సమయం ఉన్నా అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్‌ను అహింసా ఎంటర్‌టైన్మెంట్ ప్రారంభించేసింది. 🎟️ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే భారీగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. 🕒 24 గంటల్లో 10వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట. 🎫 దీంతో అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ద్వారా కలెక్షన్ ఇప్పటికే లక్ష పౌండ్లు దాటేసిందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 📊 అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం అప్పుడే సుమారు రూ.1.03 కోట్లకు పైగా వసూలైంది. మొత్తం 120 లొకేషన్లలో ‘లియో’ సినిమా విడుదలవుతోంది. 🎬 ఇంకో విషయం ఏంటంటే.. యూకేలో విడుదలకు ఇన్ని రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమా ‘లియో’. 🎥🎬

 
 
bottom of page