top of page
Suresh D

‘తండేల్’ గ్లింప్స్ రిలీజ్.. ఇక రాజులమ్మ జాతరే.. 🎬🌟

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వంలో వహిస్తున్న సినిమా ‘తండేల్’. ఇందులో మరోసారి చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ పెయిర్ జోడి కట్టడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన చైతూ పస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన సాయి పల్లవి లుక్ ఆసక్తిని కలిగించింది. కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా శనివారం ఉదయం ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. 🎥👀


bottom of page