'తని ఒరువన్ 2' అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్..🎥🎞️
- Suresh D
- Aug 29, 2023
- 1 min read
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ధృవ'. 2016లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, అప్పటి వరకూ ప్లాపుల్లో ఉన్న చెర్రీని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ధృవ'. 2016లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, అప్పటి వరకూ ప్లాపుల్లో ఉన్న చెర్రీని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్టైన 'తని ఒరువన్' అనే చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 'ధృవ' ఒరిజినల్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. సోమవారం 'తని ఒరువన్ 2' సినిమాని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'జయం' రవి హీరోగా, ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'తని ఒరువన్'. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రను పోషించారు. 2015 ఆగస్టు 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, పెద్ద సక్సెస్ సాధించింది. నిన్నటికి ఈ సినిమా వచ్చి 8 ఏళ్ళు పూర్తైన తరుణంలో, 'తని ఒరువన్ 2' ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు దర్శకుడు మోహన్ రాజా. ఈ సందర్భంగా మూవీ కాన్సెప్ట్ టీజర్ ను కూడా రిలీజ్ చేసారు. 🎥🎞️