top of page
MediaFx

అందుకే సౌందర్య అన్నను నేను పెళ్లి చేసుకోలేదు..


అలనాటి అందాలా తారల్లో సౌందర్య ఒకరు. సినీ ఇండస్ట్రీని ఒకానొక సమయంలో ఏలింది సౌందర్య. ఏ స్టార్ హీరో సినిమా చూసినా సౌందర్య హీరోయిన్ గా కనిపించేవారు. స్టార్  హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసిన సౌందర్య ఎంతోమందికి ఫెవరెట్ హీరోయిన్ గా మారారు. అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నారు సౌందర్య. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సౌందర్య. రమ్యకృష్ణ, నగ్మా, రంభ, మీనా ఇలా స్టార్ హీరోయిన్స్ తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సమయంలో సౌందర్య ఎలాంటి గ్లామర్ షో లేకుండా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సౌందర్య. అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది సౌందర్య. సౌందర్య ఈ లోకం నుంచి వెళ్లి చాలా కాలం అయ్యినప్పటికీ ఆమెను ఇప్పటికిప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే సౌందర్య అప్పట్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ఆమని ఒకరు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమనీ. చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు ఆమనీ. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమని అమ్మ, వదిన, అత్త పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఆమనీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను సుందర్య చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం.. అలాగే సౌందర్య ఫ్యామిలీతోనూ చాలా స‌న్నిహితంగా ఉండేదాన్ని అని తెలిపారు. అయితే ఒకసారి సౌందర్య వల్ల నాన్న నన్ను తన కొడుకుని అంటే సౌందర్య అన్న అమర్ ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. దాంతో నేను షాక్ అయ్యాను. ఏం అర్ధం కాలేదు.. నేను సౌందర్య ఒకరి మొహం ఒకరం చూసుకున్నాం. నేను వెంటనే సౌందర్యకు మెసేజ్ చేశా.. అయితే సౌదర్యం సోదరుడికి కాలేజ్ లో ఓ లవ్ స్టోరీ ఉంది. అది వాళ్ల నాన్నకు తెలియదు. ఆతర్వాత సౌందర్య నాన్న చనిపోయిన తర్వాత తాను ప్రేమించిన అమ్మయిని పెళ్లి చేసుకున్నాడు అమర్. అని తెలిపారు ఆమని ఈ కామన్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

bottom of page