top of page
Shiva YT

🌐 మా ప్రభుత్వం ప్రాధాన్యత అదే.. ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ.. 🌐

🌍 ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం కాశీలోని మహిళలతో తాను సంభాషించిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.


ప్రధాని మోదీ శుక్రవారం వారణాసిలో పర్యటించి సుమారు రూ. 13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అదే సమయంలో, ప్రధాన మంత్రి UPSIDA ఆగ్రో పార్క్ కార్ఖియాన్వ్‌లో బనాస్ కాశీ సంకుల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ప్రారంభించారు. కాగా, గిర్ ఆవులను అందజేసిన మహిళా లబ్ధిదారులతో ప్రధాని మోదీ ఈ సందర్భంగా సంభాషించారు. ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసిన వీడియోలో చాలా మంది మహిళలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అతను సోషల్ మీడియా సైట్ ‘X’ లో ఇలా రాశారు.. ‘మహిళా శక్తి సాధికారతే మా ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత. గిర్ ఆవు లభించిన తర్వాత తమ జీవితాల్లో చాలా మార్పు వచ్చిందని బాబా విశ్వనాథ్ నగరంలోని తల్లులు, సోదరీమణుల నుండి తెలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించింది.’’ అంటూ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో సంభాషణ సందర్భంగా పలువురు మహిళలు గిర్ ఆవుల గురించి, వాటి పెంపకం, లాభాల గురించి వివరించారు.

🐄 గిర్ ఆవులను మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం.. 🏭 బనాస్ డెయిరీని సందర్శించిన ప్రధాన మంత్రి, అక్కడ పశువుల పెంపకం మహిళలతో సంభాషించారు. రెండేళ్ల క్రితం బనాస్ డెయిరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వారణాసి పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేను బనాస్ డెయిరీ ప్లాంట్‌కి వెళ్లానని చెప్పారు. అక్కడ చాలా మంది పశువుల పెంపకంలో ఉన్న సోదరీమణులతో మాట్లాడే అవకాశం వచ్చింది. మేము 2-3 సంవత్సరాల క్రితం ఈ రైతు కుటుంబాల సోదరీమణులకు దేశవాళీ జాతి గిర్ ఆవులను ఇచ్చాము. పూర్వాంచల్‌లో మెరుగైన జాతి దేశీయ ఆవుల గురించి సమాచారాన్ని అందించారు. ఆవులను పెంచడం, రైతులు, పశువుల పెంపకందారులు దాని నుంచి ప్రయోజనం పొందాలన్నదే తమ లక్ష్యం అంటూ వెల్లడించారు. 🌿🐮


bottom of page