రంజాన్ పండుగ శోభ..
- Shiva YT
- Mar 28, 2024
- 1 min read
రంజాన్ పర్వదినం సమీపిస్తుండడంతో నగరంలో షాపింగ్ సందడి నెలకొన్నది. ప్రధానంగా పాతనగరంలో కొనుగోలు రద్దీ అధికమైంది. శనివారం అర్ధరాత్రి వరకు అత్తరు, వస్త్ర, గాజుల దుకాణాలు కిటకిటలాడాయి.
పండుగ వేళ.. షాపింగ్ కళ
నూతన దుస్తులు, గృహోపకరణ సామగ్రి కొనుగోళ్లతో పాతనగరంతోపాటు ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. వారాంతం కావడంతో శనివారం అర్ధరాత్రి వరకు చార్మినార్, గుల్జార్ హౌస్ పరిసరాలు కిక్కిరిశాయి. హలీం దుకాణాలు, బిర్యానీ అమ్మకాలు కొనసాగాయి.