బుల్లితెరపై బిగ్బాస్ సీజన్ 8 రియాల్టీ షో సందడి స్టార్ట్ కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులను మరో ఏడు రోజుల్లో ఈ షో అలరించనుంది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్బాస్ రియాల్టీ షో ప్రారంభం కానుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఈ షోలోకి రాబోయే కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్బాస్ సీజన్ 7 సూపర్ హిట్ కావడంతో ఈసారి కూడా కంటెస్టెంట్స్ ఎంపికలో అచితూచి నిర్ణయిస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్ కన్ఫార్మ్ కాగా.. మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారట. ఈసారి సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఎక్కువగా ఉండనున్నారని టాక్. బిగ్బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ భార్య తేజస్వీని ఈసారి హౌస్ లోకి వెళ్లనుందని సమాచారం. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ మాత్రం రాలేదు.
అలాగే కుమారి ఆంటీ, బర్రెలక్క, మై విలేజ్ షో అనిల్, యాదమ్మరాజు, రీతూ చౌదరి, మొగలి రేకులు ఫేమ్ ఇంద్రనీల్, గుప్పెడంత మనసు వసుధార ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఇందులో ఎవరెవరు కన్ఫార్మ్ అయ్యారనే విషయం మాత్రం తెలియరాలేదు. మరో ఏడు రోజుల్లోనే బిగ్బాస్ షో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ ఫైనల్ కాకపోవడం విశేషం. ఈసారి హౌస్ లోకి ఏకంగా 25 మందిని పంపించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందులో ఐదుగురిని వైల్డ్ కార్ట్ ఎంట్రీగా పంపించనున్నారట. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు నెట్టింట సర్క్యూలేట్ అయినవారు కాకుండా ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మరో నలుగురి పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి. యాంకర్ రీతూ చౌదరి, యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ సౌమ్యరావ్, సీరియల్ నటుడు నిఖిల్ బిగ్బాస్ షోకు కన్ఫార్మ్ అయ్యారట. అలాగే అంజలి పవన్, ఊర్మిల చౌహన్ (మోడల్), బెజవాడ బేబక్క (యూట్యూబర్), యాష్మీ గౌడ (కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్), సింగర్ సాకేత్, యాక్టర్ ఖయ్యూం (అలీ తమ్ముడు), నటుడు అభిరామ్ వర్మ (రాహు మూవీ హీరో), సోనియా సింగ్ (యూట్యూబర్) పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్, సినీనటి సన, తేజస్విని గౌడ, అభినవ్ గోమఠం పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే యూట్యూబర్ శ్వేత నాయుడు, బమ్ చిక్ బబ్లూ, అమృతా ప్రణయ్ పేర్లు మొదటి నుంచి వినిపించినా వీరు వెళ్లడం చివరి వరకు నమ్మకాలు లేవు.