'బిగ్బాస్' రియాలిటీ షోను నిషేధించాలని మహారాష్ట్రలోని ఓ ప్రజాప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు శివసేన (శిందే వర్గం) అధికార ప్రతినిధి మనీషా కయాండే.. ముంబయి నగర పోలీస్ కమిషనర్ని కలిసి బిగ్ బాస్ షోపై ఫిర్యాదు చేశారు.
జులై 18న ప్రసారమైన ఎపిసోడ్లో అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ జంట బెడ్రూమ్లో శ్రుతిమించి ప్రవర్తించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరు అన్ని రకాల హద్దులు మీరారని మండిపడ్డారు. పిల్లలు కూడా ఈ షో చూస్తారని.. ఇలాంటి అభ్యంతరకర సీన్లు వారిపై ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ షోను వెంటనే నిలిపివేయాలని.. సైబర్ క్రైమ్ చట్టాల కింద కేసు నమోదు చేయాలని మనీషా డిమాండ్ చేశారు. ఇది ఏ మాత్రం ఫ్యామిలీ షో కాదని.. ఈ కార్యక్రమాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.