top of page
MediaFx

కల్కి 2898 ఎడి నయా ట్రైలర్ అదిరిపోయింది


ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి 2898 ఏడీ పేరు మారుమోగుతోంది. ఎప్పటినుంచో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశమంతా ఎదురుచూస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సరికొత్తగా కల్కి ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ప్రభాస్ దాటికి అమెరికా బాక్సాఫీస్ షేక్ అవుతోంది. రికార్డులు క్రియేట్ అవ్వడం.. బద్దలవ్వడం జరిగిపోతోంది. కల్కి సినిమా ప్రీ బుకింగ్స్‌ టాపికే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా 2 మిలియన్స్ టికెట్స్ అడ్వాన్స్డ్‌ గా అమ్ముడవ్వమే హిస్టారికల్ గా మారిపోయింది. దటీజ్ ప్రభాస్‌ రా మచ్చాస్ అనే కామెంట్ కూడా నెట్టింట వైరల్ అవుతూ.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా కల్కి సినిమా నుంచి మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఫైనల్ వార్ పేరుతో ఓ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. గతంలో విడుదల చేసిన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేస్తే.. ఈ ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చింది. ప్రభాస్ మరోసారి అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉండనున్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే విజువల్స్ కూడా అదిరిపోయాయి.

ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన తో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా నటిస్తున్నారు. అందాల భామలు దీపికా పదుకొనె, దిశా పటాని కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ క్లాస్ మూవీ కల్కి 2898 ఎడి, దేశవ్యాప్తంగా సూపర్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె లాంటి దిగ్గజాలు నటిస్తుండగా.. ఆ సూపర్ స్టార్స్ తో పాటు తమ నుంచి మరో సూపర్ స్టార్ ఉందంటూ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మూవీ మేకర్స్. బుజ్జి అంటూ స్పెషల్‌ వీడియోని రిలీజ్‌ చేసి మూవీపై మరింత హైవ్‌ క్రియేట్‌ చేశారు. ఇక ఇప్పుడు కొత్తగా వదిలిన ట్రైలర్ హైప్ ను మరింత పెంచేసింది. జూన్ 27న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ కియేట్ చేస్తుందో చూడాలి.

bottom of page