అవాస్తవాలు ప్రచారం చేయవద్దు..
తాజాగా ఇదే విషయంపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించింది. హీరోయిన్ తో పెళ్లి వార్తలన్నీ రూమర్లేనని కొట్టి పారేసింది ‘ సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలన్నీ అబద్దాలే. హీరోయిన్‌తో వస్తున్న పెళ్లి వార్తలన్నింటిలో వాస్తవం లేదు. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం. అంతే కానీ ఇలా అబద్ధాలను ప్రచారం చేయకండి’ సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించింది. దీంతో మెగా హీరో పెళ్లి వార్తలు పుకార్లేనని తెలిసిపోయింది.