అమెజాన్ ఇప్పటి వరకు డీల్స్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. అయితే తాజాగా కొన్ని డీల్స్‌కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి ఆఫర్లు లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అమెజాన్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక బెస్ట్ టైమ్‌గా చెప్పొచ్చు.
కాగా ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై కూడా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్, వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4, వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ 12పై తగ్గింపు ధరలకు అందిస్తోంది. అలాగే సేల్‌లో భాగంగా ఐక్యూ, రెడ్‌మీ, పోకో, టెక్నో, సామ్‌సంగ్ వంటి స్మార్ట్ ఫోన్స్‌పై కూడా డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ముఖ్యంగా ఐక్యూ జెడ్9 లైట్, ఐక్యూ 12, ఐక్యూ నియో 9 ప్రో, ఐక్యూ జెడ్7 ప్రో, ఐక్యూ జెడ్9, ఐక్యూ జెడ్9ఎక్స్, రెడ్‌మీ13, రెడ్‌మీ 12, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్, షావోమీ 14 వంటి ఫోన్‌లపై ఏకంగా 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ అందించనున్నట్లు తెలుస్తోంది.
వీటితో పాటు పలు కూపన్ల ద్వారా కొన్ని ఫోన్‌లపై రూ. 10 వేరకు స్పెషల్ డిస్కౌంట్ అందించనున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ సైతం అందిస్తున్నారు. గృహోపకరణాలపై 65 శాతం వరకూ తగ్గింపు లభిస్తోంది. వీటితో పాటు స్మార్ట్ ఫోన్ యాక్సెసరీలపై 40 శాతం వరకూ, స్మార్ట్ టీవీలు, కిచెన్ ఉపకరణాలపై 65 శాతం వరకూ తగ్గింపు లభించనుంది.