top of page
MediaFx

ఈ రికార్డులకు కారణం అక్కడ కూర్చున్న వ్యక్తే..


ఈ యుగంలో బాక్సాఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని.. ఆ రికార్డులకు కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాతోపాటు ప్రభాస్ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. “ఈ విజయాలన్నింటికీ కారణం కారణం అక్కడ క్యాజువల్ గా కూర్చొన్న వ్యక్తే. ఆయన ఈ యుగంలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్. నాకు దర్శకత్వంలో చాలా స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. మనందరి డార్లింగ్. భైరవ (కల్కిలో ప్రభాస్ పేరు) ఇప్పుడు K____” అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పాత్ర గురించి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్.. కొద్ది సమయంపాటు కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆలస్యమయ్యిందా ఆచార్య పుత్రా అంటూ చివరి పది నిమిషాలలో కర్ణుడిగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు. ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్ధరిల్లింది. దీంతో కల్కి పార్ట్ 2లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమనుకున్నారంతా. ఇక ఇప్పుడు అదే విషయాన్ని నాగ్ అశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి పార్ట్ 2లో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతోనే నాగ్ అశ్విన్.. ప్రభాస్ భైరవ.. ఇప్పుడు K అంటూ ఆసక్తి కలిగించాడని అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి కల్కి పార్ట్ 2లో ప్రభాస్ పాత్రపై క్లూ ఇస్తూ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటినీ కలిగించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడి విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటు విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కల్కి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.


bottom of page