top of page
Suresh D

విశాల్‌ ‘మార్క్ ఆంటోనీ’కి బిగ్ షాక్..!🎥🎞️

హీరో విశాల్‌కు బిగ్ షాక్ తగిలింది. తాను హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం విడుదలపై తమిళనాడు హైకోర్టు స్టే విధించింది. లైకా ప్రొడక్షన్స్‌కు చెల్లించాల్సిన రూ.21.29 కోట్లలో.. రూ.15 కోట్లు చెల్లించడంలో విశాల్ విఫలమయ్యాడు. దీంతో కోర్టు ఈ సినిమాపై నిషేధం విధించింది. కాగా ఈ సినిమా ఈ నెల 15న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ కీలక పాత్రలు పోషించారు.🎥🎞️


bottom of page