యానిమల్, హాయ్ నాన్నలు సంతృప్తి పరిచాకా మళ్ళీ కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. డిసెంబర్ 22 సలార్, దానికన్నా ఒక రోజు ముందు డంకీ వస్తున్నాయని తెలిసి కూడా కేవలం వారం రోజుల రన్ కోసం ఏకంగా 10 సినిమాలు శుక్రవారం బరిలో దిగుతున్నాయి.
యానిమల్, హాయ్ నాన్నలు సంతృప్తి పరిచాకా మళ్ళీ కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. డిసెంబర్ 22 సలార్, దానికన్నా ఒక రోజు ముందు డంకీ వస్తున్నాయని తెలిసి కూడా కేవలం వారం రోజుల రన్ కోసం ఏకంగా 10 సినిమాలు శుక్రవారం బరిలో దిగుతున్నాయి. అంతో ఇంతో హారర్ ప్రియుల దృష్టిలో బజ్ తెచ్చుకున్న వాటిలో పిండం ప్రధానమైంది. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నారు. విరాజ్ అశ్విన్ జోరుగా హుషారుగా ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకుని వస్తోంది. డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి సపోర్ట్ దక్కడంతో సరిపడా థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో దొరికాయి.🎥🎭
ఇవి కాకుండా ఆలంబన, దళారి, కలశ, తికమక తండ, శంతల, సఖి, చే లాంగ్ లివ్, మాయలో బరిలో దిగుతున్నాయి. దేనికీ కనీస బజ్ లేకపోయినా మౌత్ టాక్ వస్తే ఎంతో కొంత జనాన్ని ఆకట్టుకోమా అనే నమ్మకంతో రిలీజ్ కు సిద్ధపడ్డాయి. క్యాస్టింగ్ పరంగానూ పెద్ద మెరుపులేం లేకపోవడంతో పాటు పబ్లిసిటీ అంతంత మాత్రంగా జరగడంతో ఇవి ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేకపోతున్నాయి. సలార్ వచ్చాక అన్నీ దుకాణం సర్దాల్సిందే కానీ అసలు వారం రోజుల పాటు దొరికిన ప్రతి థియేటర్లో ఇరవై ఎనిమిది షోలలో ఎన్ని క్యాన్సిల్ కాకుండా కాపాడుకుంటాయో అదే ఛాలెంజ్ గా మారనుంది.🎥🎭
నెంబర్ అయితే ఘనంగానే ఉంది కానీ వీటిలో చాలా సినిమాలు కనీస ఫీడింగ్ కు ఉపయోగపడవని బయ్యర్లు ఫీలవుతున్నారు. కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ సరిపడా ఖర్చులైనా టికెట్ల రూపంలో వసూలైతే సర్దుకోవచ్చు కానీ మరీ అయిదు పది టికెట్లు తెగితే వచ్చినోళ్లను వెనక్కు పంపడం తప్ప ఏం చేయగలమని వాపోతున్నారు. యానిమల్ ఇంకా బాగానే రాబడుతోంది. ఏ సెంటర్స్ లో హాయ్ నాన్నా స్టడీగా ఉన్నాడు. ఎక్స్ ట్రాడినరి మ్యాన్ సెలవు తీసుకోవడం లాంఛనమే. అయినా సరే ఇన్నేసి నువ్వా నేనా అని తలపడటం చూస్తే ఆశ్చర్యం కన్నా విచిత్రం అనిపిస్తే తప్పేం కాదు.🎥🎭