top of page
MediaFx

పాముతో పోట్లాడి మరీ తన పిల్లల్ని రక్షించుకున్న పక్షి..


పాములకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతాయన్న విషయం తెలిసిందే. ప్రమాదకరమైన జీవుల్లో స్నేక్స్ కూడా ఒకటి. ఒక్క కాటు వేసిందంటే ప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే. మరికొన్ని పాముల్లో చాలా విషం మరింత ఎక్కువగా ఉంటుంది. కాటు వేసిన సెకన్లలో విషం నరాలకు వ్యాపించి.. చనిపోతారు. స్నేక్స్‌కి సంబంధింనచి చాలా వీడియోలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడయా వేదికపై మరింత జోరుగా వైరల్ అవుతాయి. వాటిల్లో ఇంట్రెస్టింగ్ వీడియో మీ కోసం తీసుకొచ్చాం. పాముతో ఓ పక్షి పోట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నార్తర్న్ ఫ్లిక్ అనే పక్షి.. పాముతో పోరాడిన వీడియో ఒకటి నెట్టింట తుఫానును సృష్టించింది. దాని తీవ్రమైన పోరాటం వీక్షకులను ఆకర్షించింది. ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి.. మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. ప్రమాదకరమైన స్నేక్‌తో పోరాడి తన గూడును రక్షించుకుంది. బుల్ స్నేక్ చెట్టుపై ఎత్తుగా ఉన్న పక్షి గూడులోకి వెళ్తుంది. గూడులోని పక్షి పిల్లలను తినడానికి వెళ్తుండగా.. అప్పుడే వచ్చిన తల్లి పక్షి తన పిల్లల్ని కాపాడుకునేందుకు బుల్ స్నేక్‌తో పోరాడుతుంది. పక్షిని లెక్క చేయని పాము.. పక్షి పిల్లల్ని తినడానికి లోపలికి వెళ్తుంది. ఇక కోపంతో ఉన్న పక్షి.. దాని ముక్కుతో పామును కిందకు లాగుతుంది. అలా పాము, పక్షి రెండూ కలిసి కిందపడిపోతాయి. అక్కడే ఉన్న వీక్షకలు అది చూసి సంబర పడతారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.



bottom of page