top of page
Shiva YT

రన్ టైం విషయంలో తగ్గేదేలే అంటున్న దర్శకులు..🎬🕰️

ఆడియన్స్ భారీ ఎంటర్‌టైన్మెంట్ కోరుకుంటున్నారు.. మరి వాళ్లు కోరిందే ఇవ్వడమే కదా దర్శకుల పని. అందుకే వాళ్లు అదే చేస్తున్నారు. ఈ మధ్య చాలా సినిమాలు దాదాపు 3 గంటలు.. కుదిర్తే అంతకంటే ఎక్కువ నిడివితోనే వచ్చాయి. 🎥⏰

గదర్ 2, జైలర్ సినిమాలు 2.50 గంటల నిడివితో వచ్చి 500 నుంచి 600 కోట్లు వసూలు చేసాయి. అంతెందుకు యానిమల్ అయితే 3.21 గంటలతో వచ్చింది. దీని రచ్చ కళ్ల ముందు కనిపిస్తుంది. 🌟💰

ఈ మధ్యే దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా కింగ్ ఆఫ్ కొత్త 2 గంటల 56 నిమిషాలు, ఫ్యామిలీ మూవీ ఖుషీ 2 గంటల 46 నిమిషాలతో వచ్చాయి. అలాగే షారుక్ జవాన్ రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలు. యాక్షన్ సినిమానే అయినా.. భారీగా తీసుకొచ్చారు అట్లీ. కంటెంట్ బలంగా ఉండటంతో ఈ సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసాయి. 🎬📊

తాజాగా ప్రభాస్ సలార్ సినిమా సైతం 3 గంటల నిడివితో వచ్చేస్తుందని తెలుస్తుంది. ఈ మధ్యే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో A వచ్చింది. 🌟🕒

ఇదిలా ఉంటే దీని రన్ టైమ్ 2 గంటల 56 నిమిషాలు. భారీగానే ఉన్నా.. కంటెంట్‌తో ప్రేమలో పడిపోతారంటున్నారు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 22న విడుదల కానుంది సలార్. పార్ట్ 2 వచ్చే ఏడాది రానుంది. 🎥🕑


bottom of page