top of page
MediaFx

డ్రైవర్‌ను బస్సుతో తొక్కించి, కిలో మీటర్ వరకు ఈడ్చుకెళ్లిన మరో బస్సు డ్రైవర్..!


బెంగళూరు నుంచి విజయవాడకు మార్నింగ్ స్టార్, కృష్ణ ట్రావెల్స్ కు చెందిన రెండు ప్రైవేటు బస్సులు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదం రాజుకుంది. మహాసముద్రం టోల్‌గేట్ వద్ద ఒక బస్సు అద్దం, మరో బస్సుకు తాకడంతో గొడవ అంటుకుంది. దీంతో రెండు బస్సుల డ్రైవర్లు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలోనే శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్లిన మార్నింగ్ స్టార్ బస్ డ్రైవర్ సుధాకర్ రాజు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో సుధాకర్ రాజుపైకి బస్సును ఎక్కించి హతమార్చాడు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు.

బస్సుతో సుధాకర్ రాజును ఢీకొట్టడమే కాకుండా మృతదేహాన్ని కిలో మీటర్ దూరం వరకు ఈడ్చుకు వెళ్లాడు. దీంతో డెడ్ బాడీ పూర్తిగా ఛిద్రమైంది. ఈ ఘటనకు సంబంధించి తోటి డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి ముందస్తు సమాచారంతో విజయవాడలో నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు అదుపులో తీసుకున్నారు.

bottom of page