కేజీఎఫ్ తర్వాత నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ లుక్‍లో కనిపించనున్నాడు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత డార్లింగ్ మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్నది. ఈనెల 22న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసిన టీం.. ఇప్పుడు సాంగ్స్ విడుదల చేస్తుంది. 🎬🎶