గూగుల్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగిని తన లంచ్ సమయంలో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో.. తాను ఏం తింటుందో వీడియో షూట్ చేసి.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.తాజాగా గూగుల్‌లో పని చేసే ఓ మహిళ లంచ్ వీడియోను షేర్ చేసింది. ఇన్ స్టాలో వీడియో షేర్ చేస్తూ తాను ఆఫీసులో తీసుకునే ఆహార పదార్థాలతో కూడాని గ్లింప్స్‌ని కూడా పెట్టింది. డెస్క్ వద్ద మొదలైన ఈ వీడియో ఆఫీస్ క్యాంటీన్ వరకు వెళ్తుంది. క్యాంటీన్‌లో ఆమెకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూ.. ఎక్స్ ప్లైన్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు ఆమె ఫుడ్‌ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తాయి.
ఈ వీడియోలో మటన్ షీ కెబాబ్స్, పరాటా, గ్రీన్ చట్నీ, నూడుల్స్, సలాడ్ వంటివి సర్వ చేసుకోవడం కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.