హీరోహీరోయిన్స్ తమ నటనలో పర్ఫెక్షన్ తీసుకురావడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. తాము పోషించే పాత్ర జనాలకు మరింత దగ్గర కావడానికి ఆ పాత్ర తాలూకు రియాల్టీని అనుభూతి చెందాలనుకుంటారు. అలాంటి తారలలో ఆదా శర్మ ఒకరు.
ది కేరళ స్టోరీ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదా శర్మ తన కెరీర్ లో ఓ సినిమా కోసం ఆమె చేసిన సాహాసాన్ని బయటపెట్టింది.
ఓటీటీలో రిలీజ్ అయిన సన్ ఫ్లవర్ 2లో ఆమె బార్ లో డ్యాన్స్ గర్ల్ పాత్రను పోషించింది. అయితే ఈ పాత్రలో నటించచేందుకు ఆమె ప్రత్యేకమైన వర్కవుట్స్ చేసిందట. ముఖ్యంగా రాత్రి 9 లేదా 10 గంటల నుంచి తెల్లవారేదాక నైట్ బార్లో గడిపిందట.
నైట్ బార్ లలో డాన్సర్స్ అంటే వారు ఏం చేస్తారు ? ఎలా డాన్స్ చేస్తున్నారు? అనేది మాత్రమే కాకుండా వారీ బాడీ లాంగ్వేజ్ గురించి.. ఎలా కూర్చుంటారు.. ఎలా నడుచుకుంటారు అనే విషయాలను తెలుసుకోవాలని ఉద్దేశ్యంతో చాలా రోజులు రాత్రిళ్లు నైట్ బార్ లలో గడిపానని తెలిపింది.
అంతంగా కష్టపడడం వల్లే సన్ ఫ్లవర్ 2 సిరీస్ లో తన పాత్రకు అంత మంచి పేరు వచ్చిందని చెప్పుకొచ్చింది. ది కేరళ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవలే బస్తర్ సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు. దీంతో మరో హిట్ తో వస్తానని తెలిపింది.