top of page
Shiva YT

🎬 యానిమల్ సెకండ్ పార్ట్‏లో హీరోయిన్‏గా జాక్‏పాట్ కొట్టేసిన హీరోయిన్..

📅 డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ ఇప్పటివరకు దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రం ఇదే కావడం విశేషం.

యానిమల్ సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండడంతో ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెకండ్ పార్ట్ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. తాజాగా వినిపిస్తోన్న సమాధానం ప్రకారం.. రెండో భాగంలో హీరోయిన్‏గా మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ప్రయత్నాలు చేస్తుంది ఈ బ్యూటీ.

🎥 తమిళంలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పేట సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాళవిక. ఆ తర్వాత విజయ్‌తో మాస్టర్‌, ధనుష్‌తో మారన్‌ చిత్రాల్లో నటించింది మెప్పించింది ఈ బ్యూటీ. ఇప్పుడు విక్రమ్‌ నటిస్తున్న తంగలన్‌లో కూడా నటిస్తుంది. అలాగే ప్రభాస్, మారుతి కాంబోలో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది. ఇక ఇప్పుడు మాళవిక మోహన్ యానిమల్ పార్క్‌లో నటించనున్నట్లు సమాచారం. అయితే యానిమల్ పార్క్ లో హీరోయిన్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 🎬


bottom of page