top of page
MediaFx

ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తండ్రి కూతురి బంధంపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లల ఫోటోస్, వీడియోస్ షేర్ చేయకండి.. మృగాళ్లు ఉన్నారంటూ చిన్నారులపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని ఖండించారు. దీంతో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మా అసోసియేషన్ స్పందించింది. ఇక ఇదే విషయంపై ఇటీవల రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన శ్రీకాంత్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. బీటౌన్ నటుడు రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాంత్ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

“తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అదినేత శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన శ్రీకాంత్ సినిమాను చూశాను. ఇదొక అపురూప చిత్రం. రాజ్ కుమార్ రావు.. మీ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. మీ నటనతో ఈ స్పూర్తిదాయక కథకు జీవం పోశారు. క్లైమాక్స్ చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి. ఆ సిన్నివేశాలు నన్ను ఆలోచింపచేశాయి. శరద్ ఖేల్కర్, జ్యోతిక పెర్ఫార్మెన్స్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. తుషార్ హిద్రానీ గ్రేట్ వర్క్” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

శ్రీకాంత్ బొల్లా.. 1992 జూలై 7న ఏపీలోని మచిలీపట్నంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పదకొండో తరగతిలో 98 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ఇంజినీరింగ్ చదవాలనుకున్నప్పటికీ అంధుడని చెప్పి అనుమతి ఇచ్చేందుకు ఐఐటీ నిరాకరించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. అన్నింటినీ అధిగమించారు. ఆ తర్వాత అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‏లో చేరిన మొదటి అంధుడిగా రికార్డ్ సృష్టించారు. 2012లో హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించి 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు.

bottom of page