ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ హీరోయిన్ మాన్య గౌడ. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన బ్యాక్ బెంచర్స్ సినిమా జూలై 19న విడుదలకానుంది. రాజశేఖర్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజన్, జతిన్ ఆర్యన్, శశాంక్ సిన్హా, ఆకాష్ ఎంపీ నటించారు.
'బ్యాక్ బెంచర్స్' సినిమాలో కొత్త నటి మాన్యగౌడ కథానాయికగా నటించింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మాన్య గౌడ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. మాన్య గౌడ 'బ్యాక్ బెంచర్స్' సినిమాలో మాయగా నటించింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.
మాన్య గౌడకు ఇది మొదటి సినిమా. మూడేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసిన మాన్యకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకునట్లు తెలిపింది.
థియేటర్లలో చాలా యాక్టివ్ గా ఉన్న తనకు బ్యాక్‌బెంచర్స్ సినిమా ఆడిషన్ గురించి తెలిసిందని.. దీంతో అందులో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది. ఈ ఆడిషన్‌లో దాదాపు 700 మంది యువతీ యువకులు పాల్గొన్నారని.. దర్శకుడు ఇచ్చిన కొన్ని సన్నివేశాలను నాదైన శైలిలో నటించి చూపించానని తెలిపింది.
ఈ సినిమా కోసం సెలక్ట్ అయిన 30 మందిలో తాను ఒకరినని తెలిపింది. ఆడిషన్‌లో ఎంపికయ్యాక సుచేంద్రప్రసాద్ ఈ ఆర్టిస్టుల కోసం వర్క్‌షాప్ నిర్వహించారని.. అందులో చాలా సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారని.. 6 నెలల పాటు రిహార్సల్ చేసిన తర్వాతే చిత్ర బృందం షూటింగ్ ప్రారంభించిందని తెలిపింది.