యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ చిత్రం “హను మాన్” కోసం తెలిసిందే.
మరి మన తెలుగు సినిమా నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా రాగా సూపర్ సక్సెస్ అయ్యింది.ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా “జై హనుమాన్” ని మేకర్స్ అనౌన్స్ చేయగా దీనిపై కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఓ అప్డేట్ రావాల్సి ఉంది కానీ మేకర్స్ స్కిప్ చేశారు. అయితే ఇప్పుడు ఓ మెగా అప్డేట్ ఓ వెరీ స్పెషల్ డే కి మాత్రం వచ్చేందుకు అధిక అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదెప్పుడు అంటే ఈ ఏప్రిల్ 17కి హనుమాన్ 50 రోజుల్లానే 100 రోజుల రన్ కూడా కంప్లీట్ కానుంది. ఇప్పటికీ పలు స్క్రీన్స్ లో హను మాన్ రన్ అవుతుంది. దీనితో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జై హనుమాన్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఈ ఏప్రిల్ 17న శ్రీరామ నవమి కూడా కావడంతో చిత్ర యూనిట్ కి ఇది మరింత ప్రత్యేకమైన మూమెంట్ గా కూడా మారింది.వీటితో అయితే డెఫినెట్ గా జై హనుమాన్ అప్డేట్ రావచ్చు. మరి చూడాలి ఆరోజుకి మేకర్స్ కానీ ప్రశాంత్ వర్మ కానీ ఎలాంటి ప్లానింగ్ చేస్తారో అనేది. ఇక ఈ భారీ చిత్రానికి హరీష్ గౌర సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.🎥✨