top of page

‘వ్యూహం’ రిలీజ్‌ డేట్ మళ్లీ మారింది..🎬🔄

Shiva YT

🌐 ఏపీ సీఎం జగన్ జీవిత కథ, ఏపీ రాజకీయాల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి క్యారెక్టర్‌లో రంగం ఫేమ్‌ అజ్మల్ అమీర్ నటించారు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం సినిమా రిలీజ్‌ వాయిదా పడుతూ వస్తోంది. గతేడాది థియేటర్లలోకి రావాల్సిన ఈ పొలిటికల్ డ్రామా వివిధ కారణాలతో పోస్ట్ పోన్ అవుతోంది. అయితే ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మార్చి1న వ్యూహం సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారింది. ఒకరోజు ఆలస్యంగా అంటే మార్చి 2న థియేటర్లలో వ్యూహం సినిమా సందడి చేయనుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు రామ్ గోపాల్ వర్మ. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అని క్యాప్షన్‌తో పాటు తన మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున్న ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 📅🎥


 
bottom of page