top of page
MediaFx

బిగ్ బాస్ పేరిట జరిగే బాగోతాలు ఇవే..


ఆదిరెడ్డి.. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్ లోకి వెళ్లే వరకు జరిగిన మొత్తం విషయాలను, సెలక్షన్ ప్రాసెస్, రెమ్యూనరేషన్ తదితర విషయాల గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తనకు బిగ్ బాస్ సీజన్ ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పారితోషకం అందినట్లు చెప్పాడు. ‘నాకు బిగ్ బాస్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. మీకు బిగ్ బాస్ కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. నాకు ఇంట్రస్ట్ ఉంది అని చెప్పిన తర్వాత అధికారిక వెబ్ సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు అడిగారు. ఆ తర్వాత నాకు జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగింది. తర్వాత రెమ్యూనరేషన్ వివరాలు చర్చిస్తారు. హెల్చ్ చెకప్స్, తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఏవీలు, డ్యాన్స్ షూట్స్ అన్నీ అయిన తర్వాత హౌస్ లోకి పంపుతారు. ప్రముఖులు సిఫారసులు, రికమెండేషన్ లతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అసాధ్యం. ఎవరైనా మీకు బిగ్ బాస్ హౌస్ కి పంపుతాను అని డబ్బులు అడిగితే ఆ ట్రాప్ లో పడకండి . ఆఫర్ ఇచ్చే పనైతే వాళ్లే కాల్ చేసి.. అధికారిక మెయిల్ ఐడీ నుంచి మెయిల్ చేస్తారు’ అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.



bottom of page