top of page
Suresh D

తక్కువ బడ్జెట్లో టాప్ 5జీ ఫోన్ కావాలా..🤳

ఐకూ జెడ్9(iQOO Z9 5G).. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో రూ.19,999కు, అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో రూ.21,999కు లభిస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్‌ప్లే, డస్ట్, తేలికపాటి వాటర్ రెసిస్టెంట్ తో ఆకట్టుకుంటోంది. మీడియో టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్, 1 టీబీ వరకూ విస్తరించుకోగల మైక్రో ఎస్ డీ దీని ప్రత్యేకత. 50 ఎంపీ సోనీ ఫ్రైమరీ సెన్సార్, వెనుకవైపు 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 


రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ(Realme Narzo 70 Pro 5G).. 6.7 అంగుళాల పూర్తి హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 7050 ప్రాసెసర్ కారణంగా పనితీరు సమర్థవంతంగా ఉంటుంది. 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ తో రూ.19,999, అలాగే 8 జీబీ, 256 జీబీ స్టోరేజ్ తో రూ.21,999 అందుబాటులో ఉంది. 50 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో షూటర్ ఉన్నాయి. 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 67వాట్ల చార్జర్ తో ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. 

 

రెడ్ మీ నోట్ 13 5జీ(Redmi Note 13 5G).. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 బీబీ స్టోరేజీతో రూ.17,999కి అందుబాటులో ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో పాటు 108 ఎంపీ f/1.7 ప్రైమరీ సెన్సార్‌ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో చార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది. 33వాట్ల చార్జర్‌తో వేగవంతంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 

 

వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్(OnePus Nord CE 3 Lite).. ఈ ఫోన్ ప్రారంభంలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో రూ.19,999కి లభించేది. అనంతరం ధరను తగ్గించారు. ఇప్పుడు 128 జీబీ వెర్షన్ రూ.17,999, అలాగే 256 జీబీ వేరియంట్ రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. 6.72 అంగుళాల ఎల్ సీడీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్‌ ఓఎస్ 13పై రన్ అవుతోంది. 16 ఎంపీ ఫ్రంట్ షూటర్‌, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్లలో లభిస్తుంది. 

 

టెక్నో పోవా 6 ప్రో 5జీ..(Tecno Pova 6 Pro 5G).. 6.78 అంగుళాల హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో రూ. 19,999కు మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14పై రన్ అవుతోంది. 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కారణంగా చార్జింగ్ ఎక్కువ సేపు వస్తుంది. 70 W చార్జర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. వెనుక కెమెరా యూనిట్ చుట్టూ అప్‌డేట్ చేయబడిన ఆర్క్ ఇంటర్‌ఫేస్ ఆకట్టుకుంటుంది.

bottom of page