మన పల్లెటూర్లో జరిగే కొన్ని భలే అనిపిస్తాయి.. ఊర్లో ఉండే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.. మట్టి వాసనలు.. మంచి మనుషులు చుట్టూ ఉంటారు. ఊర్లలో రోడ్లపైన.. పొలాల్లో పరిగెత్తే ట్రాక్టర్లు మనకు నిత్యం కనిపిస్తూ ఉంటాయి. అయితే పల్లెటూర్లలో ఎక్కువగా ట్రాక్టర్లుకు స్పీకర్లు ఉంటాయి. ఎప్పుడూ పాటలు పెట్టుకొని సందడిగా కనిపిస్తూ పరుగులుపెడుతూ ఉంటాయి. అయితే ఊర్లో ట్రాక్టర్లలో ఎక్కువగా వినిపించే పాటలు ఏవో తెలుసా.. ఈ సాంగ్ మనం కచ్చితంగా వినే ఉంటాం. మనం రెగ్యులర్ గా వినే పాటలే అయినా ట్రాక్టర్లలో లేదా ఆటోలలో వింటే చాలా కొత్తగా మరింత ఉత్సహంగా అనిపిస్తాయి.. పల్లె టూర్లలో ట్రాక్టర్లు వెళ్తున్నాయంటే ఉండే పాటలు ఇవే..
ట్రాక్టర్లు ప్లే లిస్ట్ లో ముందుగా ఉండే పాట.. ఆయుధం సినిమాలోని “ఇదేమిటమ్మా మాయ మయా మైకం కమ్మిందా..” సాంగ్.. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఎక్కువగా ఊర్లల్లో ముఖ్యంగా ట్రాక్టర్లలో ఈ పాటలు వినిపిస్తాయి. అలాగే ఇదే సినిమాలోని “ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే”.. అనే సాంగ్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అలాగే రాజశేఖర్ హీరోగా నటించిన మనసున్న మారాజు సినిమాలోని “నేను గాలి గోపురం.. నువ్వు ప్రేమ పావురం” సాంగ్ ఒకటి ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది.
అదేవిధంగా రాజశేఖర్ హీరోగా నటించిన సింహరాశి సినిమాలోకి “సత్య భామ.. సత్యభామ సంగతేంటమ్మా”.. అనే పాట కూడా.. అలాగే వెంకటేష్ రాజా సినిమాలోని మల్లెల వాన మల్లెల వాన సాంగ్ కూడా పల్లెటూర్లలో ఎక్కువగానే వినిపిస్తుంది. ఇక చిరంజీవి రాక్షసుడు సినిమాలోని “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సాంగ్”, శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమాలోని “నీలాపురి గాజుల ఓ నీలవేణి ” ఈ సాంగ్స్ ఎక్కువగా మనకు పల్లెటూర్లలో వినిపిస్తూ ఉంటాయి. ఆ పాటలు పెట్టుకొని ట్రాక్టర్లు వెళ్తూ ఉంటే భలేగా అనిపిస్తుంది. ఆ సాంగ్స్ కూడా చాలా కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది. ఏదేమైనా ఆ వైబ్ వేరబ్బా..!