top of page
Suresh D

టాలీవుడ్‌ రేంజ్‌ పెంచే బాధ్యత.. ఆ నలుగురిదేనా..🎥✨

ఈ ఏడాది టాలీవుడ్‌ రేంజ్‌ని నిర్ణయించే బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ఫస్టాఫ్ సంగతి పక్కనపెడితే.. సెకండాఫ్ లో జరగబోయే మిరాకిల్స్ ఏంటి? ఆ నలుగురు ఏమంటున్నారు? ఇంతకీ ఎవరు వారు? ఏయే సినిమాలు చేస్తున్నారు? ఆ సినిమాల స్థాయి ఎలాంటిది ఇపుడు తెలుసుకుందాం. 

ఇంటర్నేషనల్‌ లెవల్లో మారుమోగిన సినిమా ట్రిపుల్‌ ఆర్‌. ఈ సినిమా హీరోలు ఇద్దరూ ఈ ఏడాది తప్పక స్క్రీన్‌ మీదకు వస్తారు. అది కూడా సెకండ్‌ హాఫ్‌లో. కొరటాల శివ డైరక్షన్‌లో దేవర పార్ట్ ఒన్‌ చేస్తున్నారు తారక్‌. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

అటు గేమ్‌ చేంజర్‌ని కంప్లీట్‌ చేసే పనుల్లో ఉన్నారు రామ్‌చరణ్‌. గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ దాదాపు ఫిక్స్ అయిందన్నది దిల్‌రాజు చెబుతున్న మాట. శంకర్‌తో మాట్లాడి త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా అన్నారు దిల్‌రాజు. ట్రిపుల్‌ ఆర్‌ హీరోలిద్దరూ ఇలా తమ తమ నెక్స్ట్ సినిమాలతో మరోసారి ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ ని ఆకట్టుకుంటారనే నమ్మకం గట్టిగానే కనిపిస్తోంది.

సలార్‌తో సక్సెస్‌ మీదున్నారు డార్లింగ్‌ ప్రభాస్‌. కల్కి 2898 ఏడీతో మరోసారి ప్యాన్‌ రేంజ్‌ని దాటి ప్రూవ్‌ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మహాభారతంతో మొదలయ్యే కథ అంటూ ఇప్పటికే ఊరిస్తున్నారు మేకర్స్. టాలీవుడ్‌ మేకింగ్‌ స్థాయిని ఇంటర్నేషనల్‌ లెవల్లో ప్రూవ్‌ చేసుకునే సినిమా అనే మాట కూడా బాగానే వినిపిస్తోంది.

సరిహద్దులు దాటి చెలరేగిపోయిన ఘనత పుష్పరాజ్‌ది. ఇప్పుడు రూల్‌ చేయడానికి రెడీ అంటున్నారు. అసలు తగ్గేదేలే అంటూ వెయ్యి కోట్ల మార్కును టార్గెట్ చేస్తోంది టీమ్‌. ఎక్కడా రాజీ పడకుండా మాస్‌ జాతరచేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్‌. 2024లో టాలీవుడ్‌ రేంజ్‌ని మార్చే సినిమాల్లో ముందు వరుసలో వినిపిస్తోంది పుష్ప పేరు.

bottom of page