top of page
MediaFx

జీమెయిల్‌లో ఉన్న ఈ సీక్రెట్‌ ఫీచర్స్‌ గురించి మీకు తెలుసా.?

ఇంటర్నెట్ కనెక్షన్‌ లేకపోయినా జీమెయిల్‌ను ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా. ఇందుకోసం వ్యూ ఈ మెయిల్స్‌ ఆఫ్‌లైన్‌ అనే ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్‌ జీమెయిల్‌ సెట్టింగ్స్‌లో ఉంటుంది.మీరు ఎదుటి వ్యక్తికి మెయిల్‌ను కాన్ఫిడెన్షియల్‌గా పంపించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునే రహస్య ఈమెయిల్‌ను పంపించుకోవచ్చు. ఇందుకోసం మెయిల్‌ను పంపుతున్నప్పుడు లాక్‌ గుర్తుపై నొక్కితే సరిపోతుతుంది. మీరు పంపే మెయిల్ కాన్ఫిడెన్షియల్‌గా మారిపోతుంది.మెయిల్స్‌ను షెడ్యూల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్‌ సహాయంతో మీరు పంపాలనుకున్న మెసేజ్‌ను అనుకున్న సమయానికి షెడ్యూల్‌ను చేసుకోవచ్చు. ఇందుకోసం షెడ్యూల్ ఆప్షన్‌కు వెళ్లి డేట్, టైమ్‌ను సెట్ చేసుకోవాలి.మీరు ఒకవేళ మెయిల్‌ను చదివినట్లు మార్క్‌ చేయాలనుకుంటే ‘Shift + I’ షార్ట్‌కట్‌ను నొక్కితే సరిపోతుంది. అలాగే మెయిల్‌ ఎవరికీ చేయాలనుకుంటున్నారో వారిని యాడ్ చేయడానికి ‘Shift + Ctrl + B’ ఉపయోగపడుతుంది.ఇక మెయిల్‌లో రైట్‌ క్లిక్‌ చేసినప్పుడు.. అటాచ్‌మెంట్, మూవ్ టు ట్యాబ్, రిప్లై ఆల్, సెర్చ్ ఆప్షన్ కనిపిస్తాయి. వీటి సహాయంతో మీరు చేయాలనుకున్న టాస్క్‌లను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

bottom of page