top of page
Suresh D

'రామాయణం' కోసం ఇద్దరు ఆస్కార్ అవార్డు సంగీత దర్శకులు..?✨

దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటించనున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఆస్కార్-విజేత సంగీత దర్శకులు AR రెహమాన్ మరియు హన్స్ జిమ్మర్ ఈ ప్రాజెక్ట్ చిత్రం కోసం ఆన్ బోర్డులోకి వచ్చినట్లు సమాచారం.హన్స్ జిమ్మర్ డూన్, డార్క్ నైట్ ట్రీలోజి , గ్లాడియేటర్, ఇన్‌సెప్షన్ మరియు ది లయన్ కింగ్ వంటి చిత్రాలకు సంగీత స్వరకర్తగా పనిచేశాడు. హన్స్ జిమ్మర్‌కి రామాయణం మొదటి భారతీయ చిత్రం. మూవీ మేకర్స్ రామాయణాన్ని ట్రైలాజీగా ప్లాన్ చేసారు మరియు టీమ్ ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ ప్రారంభించింది. ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.✨

bottom of page