top of page
Shiva YT

‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్ పూర్తి.. విదేశాల నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన విజయ్..

లైగర్ సినిమా భారీ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు. గతంలో తనకి ‘గీతగోవిందం’ లాంటి 100 కోట్ల హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కనెక్ట్ అవుతూనే విజయ్ డ్యాన్స్ కి కావాల్సిన మాస్ అంశాలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ పరుశురామ్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా కౌగలించుకొని ఆనందం వ్యక్తం చేస్తూ మా షూట్ కంప్లీట్ అయిందని విదేశాల్లో షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోని రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అయిపోయింది అంటూ రిలీజ్ చేసిన చిన్న వీడియో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రానుంది. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు.


bottom of page